Site icon Mana Prajapaksham

వసతి గృహాల్లో టాయిలెట్లు కట్టించలేని మీకు ప్రోటోకాల్ గుర్తొచ్చిందా?

నారాయణపేట, మన ప్రజాపక్షం :ప్రభుత్వ వసతి గృహాల్లో కనీసం విద్యార్థులకు టాయిలెట్లు కట్టించలేని కాంగ్రెస్ నాయకులకు ప్రోటోకాల్ గుర్తొచ్చిందా అంటూ బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బొదిగెలి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేట పట్టణ కేంద్రంలోని ఎర్రగుట్ట సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో కాంగ్రెస్ నాయకులు చేసిన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రోటోకాల్ పాటించని అధికారులపై చట్టపరంగా పిర్యాదు చేయాలి గానీ ఎమ్మెల్యే మెప్పు కోసం బ్యానర్లు చింపి విద్యార్థులను బయటికి పంపి గేట్లకు తాళం వేసే అధికారం కాంగ్రెస్ నాయకులకు ఎవరిచ్చారని మండిపడ్డారు .ఒక ప్రభుత్వ అధికారితో ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పించిన కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఇచ్చిన తప్పుడు హామీలపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలన పేరుతో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇట్లాంటి దౌర్జన్యాలను ప్రజలు సహించరని హెచ్చరించారు. తక్షణమే కాంగ్రెస్ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Exit mobile version