Site icon Mana Prajapaksham

హోంగార్డ్స్ కు ఉలెన్ జెర్సీ & రెయిన్ కోట్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : నాగర్ కర్నూల్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 117 మంది హోంగార్డ్స్ సిబ్బందికి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉలెన్ జెర్సీ మరియు రైన్ కోట్స్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల సమయంలో వారు చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఉత్తమంగా నిబద్ధతతో పనిచేసి జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని  సూచించారు. అదేవిధంగా హోంగార్డ్స్ సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. జిల్లా ఎస్పీ చొరవ తీసుకొని హోంగార్డ్స్ సిబ్బందికి ఉలెన్ జెర్సీ & రైన్ కోట్ ఇప్పించినందుకు జిల్లా హోంగార్డ్స్ సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హోంగార్డు ఇంచార్జ్ ఆర్ఐ రాఘవరావు మరియు జిల్లా హోంగార్డులు, సిబ్బంది పాల్గొన్నారు.

Exit mobile version