జిల్లా ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్

మహబూబ్ నగర్, మన ప్రజాపక్షం :జిల్లా కేంద్రంలో మాజీ మంత్రులు డా.సి.లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య యాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నరేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి డా. సి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆల్మట్టి కడితే కృష్ణ నదిపై ఉన్న ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారుతుందని అన్నారు. సాగు నీళ్లు కాదు, తాగడానికి నీళ్లు కూడా ఉండవని తెలిపారు. అందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కర్ణాటక జల దోపిడిని అడ్డుకుంటామని తెలిపారు. కర్ణాటక దోపిడితో పాలమూరు ఎడారిగా మారుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు అయిందని, ఈ రెండేళ్లలో అభివృద్ధి కుంటు పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు గత పదేళ్లు అని మాట్లాడటం అలవాటు అయిందని ఏద్దేవా చేశారు. కాంగ్రెస్ 2004 నుండి 2014 వరకు రాష్ట్రాన్ని పాలించిందని గుర్తు చేశారు. యాబై ఏండ్లు అధికారంలో ఉందని, కనీస మౌళిక వసతుల కల్పన చేయలేకపోయిందని అన్నారు. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేక పోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మిషన్ భగీరథ మెయింటైన్ చేయడం చేత కావడం లేదని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ మహబూబ్ నగర్ జిల్లాకు వలసల జిల్లా అని పేరు తెచ్చారని అన్నారు. జిల్లా ప్రాజెక్టులు అంటేనే పెండింగ్ ప్రాజెక్టులు అనేలాగా చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చినం అని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టు 90 శాతం పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా పనులు పెండింగ్ పెట్టారని అన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసే పరిస్థితి లేదని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం తొందరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. మా హయాంలో ఇరిగేషన్ కెనాల్ లకు టెండర్ కూడా పిలిచాం అని, ప్రభుత్వానికి టైం ఇచ్చినం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును మొత్తం పడావు పెట్టేలా ఉన్నారని ఏద్దేవా చేశారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయాలని ఉద్యమం చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రభుత్వానికి టైం ఇచ్చి పండుగల తరువాత కార్యచరణ ప్రారంభిస్తాం అన్నారు. బిఆర్ఎస్ హయంలో ఒక పంప్ స్టార్ట్ చేసినం అని,కరివెన వరకు నీళ్లు తీసుకొని రావచ్చు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా ఇచ్చే పరిస్థితి లేదని, ఇప్పటికే పంట నష్టపోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో సీఎం కేవలం 16 నెలలే ఉన్నాడు. ఆరు నెలలు ఢిల్లీలో, ఇతర రాష్ట్రాల్లో ఉన్నాడని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు సిద్ధం అయ్యారని తెలిపారు.

Mana Praja Paksham Desk
Mana Praja Paksham Desk
Articles: 224

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *