Site icon Mana Prajapaksham

బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెల్పిన డీఇఓ రమేష్ కుమార్

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారుచేసి లయబద్ధంగా బతుకమ్మను సాంప్రదాయ పద్ధతిలో ఆడి అందరినీ ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ హాజరైనారు. డిఇఓ రమేష్ కుమార్  మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అనేది తెలంగాణలో ముఖ్యమైన పండుగ అని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం  బతుకమ్మ పండగ అని, మహిళలు పూలతో జరుపుకునే ప్రత్యేకమైనటువంటి దేశంలోనే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ అని డిఇఓ రమేష్ కుమార్ తెలియజేశారు. ఉపాధ్యాయులకు విద్యార్థులకు డీఈవో ముందస్తు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ యస్. ఫాతిమా రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version