జనగామ, మన ప్రజాపక్షం :పోరాటాలు ఉద్యమాలతో ఏర్పడిన జనగామ జిల్లాకు ప్రజలకు అందుబాటులో కలెక్టరేట్ ఉన్నది అంటే అది ఏసి రెడ్డి నగర్ గుడిసే వాసులు నాడు త్యాగం చేసిన ఫలితమే వారికి పునరావాసం పథకం కింద ఎల్లంల రోడ్డుకు నిర్మించిన రెండు పడకల గదుల ఇండ్లలో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సరియైన కరెంటు సౌకర్యం మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వారిని వారి త్యాగాన్ని విస్మరించడమే అని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. జనగామ మున్సిపల్ కార్యాలయం ముందు ఎసిరెడ్డి నగర్ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మున్సిపల్ పౌర సేవలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ ధర్నాకు సిపిఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అధ్యక్షత వహించగా వారు మాట్లాడుతు. జనగామ జిల్లా కోసం పోరాడిన వారిలో నాటి ఏసి నగర్ గుడిషావాసులు ముందు వరుసలో ఉన్నారని అలాగే జిల్లా ఏర్పడ్డాక ప్రజలందరి కోసం అన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు యువజన సంఘాలు కోరిక మేరకు ఇండ్లు స్థలాలు త్యాగం చేసిన వారికి జనగామ పట్టణానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించారు అక్కడ సరైన వసతులు లేక అంతర్గత సిసి రోడ్లు డ్రైనేజీ లేక వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే మురుగునీరు ఇండ్ల మధ్య నిలిచి దోమలు ఈగలు తో రోగాల బారిన ప్రజలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఏసిరెడ్డి నగర్ డబల్ బెడ్ రూమ్ కాలనీలో ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి మోడల్ కాలనీగా పట్టణంలో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి గారికి డిమాండ్లతో కూడిన మెమోరాడం ఇచ్చారు. ఈ ధర్నాకు రెండవ వార్డు మాజీ కౌన్సిలర్ బికోజు అనిత మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు ఇరి అహల్య, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, విజయేందర్, బిట్ల గణేష్, గంగాపురం మహేందర్, పట్టణ కమిటీ బూడిది ప్రశాంత్, పల్లెర్ల లలిత, పందిళ్ళ కళ్యాణి, శాఖ కార్యదర్శిలు పాము బిక్షపతి, బూడిద శ్రీకాంత్, సోల్తి రాములు, చిదురాల ఉపేందర్, ఎండి మునీర్, కుంటి మురళి, గాడి శివ ధరావత్,గంగమ్మ, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.
జనగామ మునిసిపల్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో నిరసన