Site icon Mana Prajapaksham

వైద్య, నర్సింగ్ కళాశాలల నిర్మాణ పనులు వేగవంతం

నిర్మల్, మన ప్రజాపక్షం :నిర్మల్ జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు పకడ్బందీగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో, ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో జరుగుతున్న ఈ పనులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. మొత్తం 25 ఎకరాల విస్తీర్ణంలో కళాశాల భవనాలు, రహదారులు, ఇతర మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. కళాశాల ప్రధాన భవనం, రోడ్డు నిర్మాణం, బాలక, బాలికల వసతి గృహాలు, ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ వసతి గృహాలు, అతిథి గృహం, ఇతర విభాగాల పనులు ప్రస్తుతం ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడానికి, అన్ని సదుపాయాలతో కూడిన ఆధునిక కళాశాలను రూపుదిద్దుతున్నామని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Exit mobile version