• పలువురు ప్రశంసలు
తాడూరు, మన ప్రజాపక్షం :నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండలం ఎట్టిదర్పల్లి గ్రామంలో కౌకుంట్ల రమేష్ గౌడ్ తన సొంత ఖర్చుతో గ్రామానికి నూతన బస్టాండ్ నిర్మించారు. గ్రామ యువకుల ఆధ్వర్యంలో ఈ బస్టాండ్ పనులు పూర్తయ్యాయి. గ్రామ ప్రజల రాకపోకలకు సౌకర్యంగా ఉండే విధంగా ఈ బస్టాండ్ ఏర్పాటు చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రమేష్ గౌడ్ చేసిన ఈ కృషి ప్రశంసనీయం అని గ్రామస్థులు అన్నారు. గ్రామ అభివృద్ధి పట్ల ఆయన చూపిన ఆసక్తి అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్‌కు గ్రామ ప్రజలందరూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరపట్ల భరత్ గౌడ్, మధు గౌడ్, కర్నె మల్లేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సొంత నిధులతో గ్రామానికి బస్టాండ్ నిర్మాణం




