Site icon Mana Prajapaksham

అంగన్వాడీల అక్రమ అరెస్టులను ఖండించండి

నారాయణపేట, మన ప్రజపక్షం :తమ సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం రోజు హైదరాబాదులో ప్రజా దర్బార్ ప్రజావాణిలో విన్నవించేందుకు బయలుదేరుతున్న అంగన్వాడీ యూనియన్ నాయకులను ఇంటి దగ్గరనే అరెస్టు చేసి ప్రభుత్వం నిర్బంధము ప్రయోగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సి ఆర్ గోవింద్ రాజ్ విమర్శించారు. మక్తల్ పట్టణ టౌన్ లో ఎన్. భాగ్యలక్ష్మి, నరసింగమ్మ, హెల్పర్లను మక్తల్ ప్రాజెక్టులోని అంగన్వాడి టీచర్లను, హెల్పర్లను మక్తల్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడి టీచర్లను ఇంటి దగ్గరనే అరెస్టు చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన నిరంకుశ పాలన తలపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్రీ ప్రైమరీ స్కూల్, పీఎం శ్రీ విద్యను విద్యాశాఖకు అప్పజెప్పడం కారణంగా అంగన్వాడి కేంద్రాలు మూతపడే ప్రమాదం ఉన్నదని కనుక వాటిని ఐసిడిఎస్ కు అప్పజెప్పి అంగన్వాడి కేంద్రాల నిర్వహణ బాధ్యత అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా కనీస వేతనం 18 వేల రూపాయలు నేటికీ అమలు చేయడం లేదని విమర్శించారు. రిటర్మెంట్ బెనిఫిట్ జీవో నెంబర్ 8ని సవరించాలని కోరారు. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేందుకు ముందుకు రావాలని కానీ సమస్యలను పరిష్కరించకుండా అంగన్వాడి టీచర్లను అక్రమంగా అరెస్టులు చేయడం గృహనిర్బంధాలకు గురి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ముఖ్యంగా ప్రజా పాలన అంటున్న రేవంత్ రెడ్డి పరిపాలనకు తగదన్నారు.

Exit mobile version