Site icon Mana Prajapaksham

పొన్నం ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు



హైదరాబాద్, మన ప్రజాపక్షం :తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు దాఖలైంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకు ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.సహచర మంత్రి అన్న విజ్ఞత లేకుండా, ప్రజల్లో ఉన్నామనే ఆలోచన లేకుండా మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి లక్ష్మణ్‌ను దూషించడం సరికాదని, దీనిని తాము ఖండిస్తున్నామని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను తక్షణమో సుమోటోగా స్వీకరించి అట్రాసిటీ కేసు నమోదు చేయడంతోపాటు కమిషన్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శిల దృష్టికి తీసుకువెళ్లాలని వారు కోరారు.

Exit mobile version