మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నిజాముద్దీన్ (32) అమెరికా పోలీసుల కాల్పుల్లో మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎంఎస్ చేసేందుకు 2016లో యూఎస్ కు వచ్చిన అతడు జాబ్ లేకపోవడంతో కాలిఫోర్నియాలో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. రూమ్మేట్స్ మధ్య గొడవ జరుగుతోందని సెప్టెంబర్ 3న కాల్ వచ్చింది. నిజాముద్దీన్ ఒకరిపై కత్తితో దాడి చేస్తున్నాడు. కంట్రోల్ చేసేందుకు కాల్పులు జరిపాం. గాయాలతో అతడు మరణించాడు అని అమెరికా పోలీసులు తెలిపారు.
అమెరికాలో గొడవ..పోలీసుల కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి