Category Uncategorized

అద్దె చెల్లించలేదని.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం

నిజామాబాద్, మన ప్రజాపక్షం : నిజామాబాద్ జిల్లాలోని బోధన్ లో గురువారం ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి అద్దె చెల్లించని కారణంగా తాళం వేశారు. కార్యాలయానికి 36 నెలలుగా అద్దె బకాయి ఉన్నప్పటికీ, ఒక్క నెల అద్దె కూడా చెల్లించలేదని భవన యజమాని ఆరోపిస్తున్నారు. గత మూడేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో యజమాని కార్యాలయానికి తాళం వేశారు.నెలకు…

శబరిమల ఆలయంలో 4.5 కిలోల బంగారం మాయం

కేరళ, మన ప్రజాపక్షం : ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోని ద్వారపాలకుల విగ్రహాలకు చెందిన బంగారు తాపడంలో భారీగా బంగారం గల్లంతైన ఘటనపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సుమారు 4.54 కిలోల బంగారం మాయం కావడంపై సమగ్ర విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు…

బిజెపి రాష్ట్ర నాయకులు ఎంజెఆర్ ఆధ్వర్యంలో నేడే రక్తదాన శిబిరం

ఊర్కొండ, మన ప్రజాపక్షం : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వారోత్సవాల సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండల కేంద్రంలో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్టు బిజెపి రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో గర్వించదగ్గ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర…

అంబేద్కర్ కళాభవన్ పై విచారణ చేపట్టిన అధికారులు

మహబూబ్ నగర్, మన ప్రజాపక్షం : అంబేద్కర్ కళాభవనం పరిరక్షణ సమితి కమిటీ ఆధ్వర్యంలో ఉర్దూ ఘర్ వద్దు కళాభవనము ముద్దు అనే అంశాన్ని గత మూడు నెలల నుండి ప్రజా ప్రతినిధులకు, ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఈరోజు విచారణకు రావడం జరిగింది. (అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ) శివేంద్ర ప్రతాప్, అర్బన్…

మేదరి కులస్తులకు ప్రభుత్వం చేయూతనివ్వాలి

ఆదిలాబాద్, మన ప్రజాపక్షం ప్రతినిధి :ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు సూరినేని కిషన్ మాట్లాడుతూ మహేంద్ర మేదరి కులస్థులకు ప్రభుత్వం చేయూతనివ్వాలని, వెదురు బొంగు ఉచిత సరఫరా చెయ్యాలని కోరారు. తమ కులానికి ప్రభుత్వం ఆర్థిక, సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని, టైగర్ జోన్ లో వెదురు పెంపకం చేపట్టి…

మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో నిందితునికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు 5000 జరిమాన

Accused sentenced to 20 years rigorous imprisonment and fined Rs 5000 in rape case of minor girl

మెదక్, మన ప్రజాపక్షం : మెదక్ జిల్లా శంకరంపేట్ (ఎ) మండలంలో చోటుచేసుకున్న ఓ హృదయ విదారక సంఘటనలో కేవలం ఏడేళ్ల చిన్నారిపై దారుణమైన లైంగిక దాడి చేసిన నేరస్తుడు థలారి మోహన్‌కు కోర్టు అత్యంత కఠినమైన శిక్ష విధించింది. ఈ తీర్పు చిన్నారికి న్యాయం చేయడమే కాకుండా, సమాజానికి కూడా ఒక బలమైన సందేశాన్ని…

స్టేషన్ ఘన్ పూర్ లో భగ్గుమన్న రాజకీయాలు.. రాజయ్య గృహనిర్బంధం

స్టేషన్ ఘన్ పూర్, మన ప్రజాపక్షం : స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పోరుకు సిద్ధమైన మాజీ ఉప ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్యను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రఘునాథపల్లి మండలంలో ఆయన చేపట్టాలనుకున్న పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిణామంతో నియోజకవర్గంలో తీవ్ర…

పల్లె దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా తూడుకుర్తి గ్రామంలోని పల్లె దవాఖానాను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్, ఆసుపత్రి సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి, ప్రతీ ఒక్కరూ సమయానికి హాజరై,…

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేసేలా అధికారులు చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ సోమవారం నాగర్ కర్నూల్ మండల పరిధిలోని తూడుకుర్తి గ్రామాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న ఇందిరమ్మ గృహ నిర్మాణ పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామంలో…

150 కిలోల నల్ల బెల్లంతో పట్టుబడిన మహిళ

ఆమనగల్లు, (మన ప్రజాపక్షం): ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా నల్లబెల్లం ఎవరు తరలించిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆమనగల్లు ఎక్సైజ్ సీఐ బధ్యనాధ్ చౌహన్ హెచ్చరించారు. దసరా పండగ సందర్బంగా ఆదివారం ఉదయం ఆమనగల్లు బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించగా హైదరాబాద్ నుండి అక్రమంగా తెచ్చిన 150 కిలోల నల్లబెల్లం, ఆర్ఎస్ బెల్లం ముద్దలు, విప్ప…