Category Uncategorized

జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు

జనగామ, మన ప్రజాపక్షం :జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారి తెలిపారు. మొత్తం 403.26 మెట్రిక్ టన్నులు (ఎంటిఎస్) యూరియా ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాలు, ప్రైవేట్ కేంద్రాలు మరియు రవాణాలో ఉంది. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మండలాల వారీగా యూరియా నిల్వలు బచ్చన్నపేట మండలం…

మేదరి కులస్తులకు ప్రభుత్వ చేయూతనివ్వాలి

ఆదిలాబాద్, మన ప్రజాపక్షం ప్రతినిధి :ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు సూరినేని కిషన్ మాట్లాడుతూ మహేంద్ర మేదరి కులస్థులకు ప్రభుత్వం చేయూతనివ్వాలని, వెదురు బొంగు ఉచిత సరఫరా చెయ్యాలని కోరారు. తమ కులానికి ప్రభుత్వం ఆర్థిక, సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని, టైగర్ జోన్ లో వెదురు పెంపకం చేపట్టి…

శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 3.36 కోట్ల బంగారం పట్టివేత

హైదరాబాద్, మన ప్రజాపక్షం : హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు విమానశ్రయంలో 3.38 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐరన్ బాక్స్ లో బంగారాన్ని దాచి తరలిస్తున్న ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ. 3.36 కోట్లు…

లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఆర్ఐ, సర్వేయర్

వనపర్తి, మన ప్రజాపక్షం : వనపర్తి జిల్లాలో ఇద్దరు రెవెన్యూ అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) సి. వాసు, మండల సర్వేయర్ నవీన్ రెడ్డి ఓ వ్యక్తి నుంచి రూ.40,000 లంచం…

కేటీఆర్ ఒక చవట…

హైదరాబాద్, మన ప్రజాపక్షం :బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత చెల్లెలు కవిత మాటలకే జవాబు చెప్పలేని కేటీఆర్ ఒక ‘చవట దద్దమ్మ’ అంటూ ఘాటుగా విమర్శించారు. సీఎల్పీ మీడియా సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ రాష్ట్రానికి పట్టిన శని అని, ఆయన నోటి నుంచి…

అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంటున్నారు

ఖమ్మం, మన ప్రజాపక్షం : తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌పై బురద చల్లుతున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క తీవ్రంగా విమర్శించారు. రైతుల సమస్యల విషయంలో కేంద్రం బాధ్యతను పక్కనపెట్టి, రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని ఆమె హితవు పలికారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో…

సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు షాక్… ప్రోటోకాల్ వివాదంలో నోటీసు, కోర్టు ధిక్కరణ కేసులో వారెంట్

రాజన్న సిరిసిల్ల, మన ప్రజాపక్షం : రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వరుస వివాదాలతో వార్తల్లో నిలిచారు. ఒకే రోజు అటు ప్రభుత్వం నుంచి, ఇటు హైకోర్టు నుంచి ప్రతికూల చర్యలు ఎదుర్కోవడం అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రోటోకాల్ ఉల్లంఘించారన్న ఆరోపణలపై ప్రభుత్వం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ…

విశాఖపట్నం – హైదరాబాద్ విమానానికి తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్, మన ప్రజాపక్షం : విశాఖపట్నం-హైదరాబాద్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ రోజు మధ్యాహ్నం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. విమానం కొంత దూరం ప్రయాణించిన తర్వాత, రెక్కలో పక్షి ఇరుక్కోవడంతో ఇంజిన్ ఫ్యాన్ రోటార్ బ్లేడ్లు దెబ్బతిన్నాయి.అప్రమత్తమైన పైలట్ చాకచక్యంగా విమానాన్ని వెనక్కి తీసుకువచ్చి సురక్షితంగా ల్యాండ్ చేశాడు.…

రేవంత్ రెడ్డితో బ్రిటన్ హై కమిషనర్ భేటీ

హైదరాబాద్, మన ప్రజాపక్షం : తెలంగాణ విద్యార్థులకు ఉన్నత విద్యను మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ముందడుగు వేసింది. యూకే ప్రభుత్వం అందించే ‘చెవెనింగ్ స్కాలర్‌షిప్స్‌’ను రాష్ట్రంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు అందజేయడానికి బ్రిటన్ అంగీకారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో భారత బ్రిటీష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ ఈ…

పార్టీ మారుతున్నారనే ప్రచారంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందన

హైదరాబాద్, మన ప్రజాపక్షం : తాను పార్టీ మారుతున్నట్లు, కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఈ ఊహాగానాలన్నింటినీ ఆయన తీవ్రంగా ఖండించారు. అవన్నీ అవాస్తవాలని, ప్రజలు ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, తనపై…