Category Telangana

బంజారాల ఆత్మగౌరవ నిరసన సభకు తరలిన బంజార నాయకులు

జనగామ, మన ప్రజాపక్షం : ఎస్టీ జాబితా నుండి లంబాడిలను తొలగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మరియు సోయం బాబురావు చేస్తున్న కుట్రపూరిత రాజకీయాలకు నిరసనగా హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర ఎల్-జెయేసి ఆధ్వర్యంలో లంబాడిలా ఆత్మగౌరవ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో లంబాడిలు వలసవాదులు కాదు మూలవాసులం అని…

జిల్లాస్థాయి టిఎల్ఎం మేళా

జనగామ, మన ప్రజాపక్షం: స్థానిక సాయిరాం కన్వెన్షన్ నందు 12 మండలాలకు చెందిన మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు గెలుచుకున్న ఉపాధ్యాయ, ఉపాధ్యాయినీలు జిల్లా స్థాయిలో వాటిని ఎగ్జిబిట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంచార్జి కలెక్టర్ పింకేష్ కుమార్ హాజరయ్యారు. టిఎల్ఎమ్ ఎగ్జిబిట్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగు,…

నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలందించాలి

జనగామ, మన ప్రజాపక్షం: నిరుపేదలకు వైద్య సేవలు అందించడం పట్ల డాక్టర్లు బాధ్యత యుతంగా వ్యవహారించాలని ఇంచార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. ఓబుల్కేశ్వపూర్ పీహెచ్సి ని ఇంచార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్ ఆకస్మిక తనికి చేశారు. ముందుగా డ్యూటీ డాక్టర్ల రిజిస్టర్, ఒపీ, ఇన్ పేషంట్ తదితర రిజిస్టర్ లను పరిశీలించారు. స్వస్థ నారీ…

తెలంగాణలో 12,452 పోలీసు ఉద్యోగాల భర్తీకి కసరత్తు

తెలంగాణలోని నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పోలీస్ శాఖలో భారీ సంఖ్యలో ఖాళీలను భర్తీ చేసేందుకు వేగంగా కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీలలో కలిపి మొత్తం 12,452 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు…

బతుకమ్మ పండుగలో ఆకాశం నుంచి పూల వర్షం

బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 30 వ తారీఖున గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అమరవీరుల స్మార్క చిహ్నం నుండి బతుకమ్మ ఘాట్ వరకు 2500 మంది మహిళలు బతుకమ్మలతో ర్యాలీ చేపట్టనున్నారు. ఆ ర్యాలీ సమయంలో హెలికాఫ్టర్ నుంచి పూలను చల్లి వారికి స్వాగతం…

పొంగులేటి బయోపిక్ లో హీరోగా సుమన్

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీవిత చరిత్ర తిరగకెక్కనుంది. “శ్రీనన్న అందరివాడు” అనే టైటిల్ తో రూపుదిద్దుకునే ఈ సినిమాలో పొంగులేటి వ్యక్తిగత రాజకీయ జీవితాన్ని తెరకెక్కించనున్నారు. సీనియర్ నటుడు సుమన్ ఈ చిత్రంలో పొంగులేటి పాత్రను పోషించనున్నారు. దీనికి డైరెక్టర్, నిర్మాతగా వెంకట నరసింహా రాజ్ వ్యవహరిస్తుండగా, పాటలు కాసర్ల శ్యాం రాస్తున్నారు.

అమెరికాలో గొడవ..పోలీసుల కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నిజాముద్దీన్ (32) అమెరికా పోలీసుల కాల్పుల్లో మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎంఎస్ చేసేందుకు 2016లో యూఎస్ కు వచ్చిన అతడు జాబ్ లేకపోవడంతో కాలిఫోర్నియాలో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. రూమ్మేట్స్ మధ్య గొడవ జరుగుతోందని సెప్టెంబర్ 3న కాల్ వచ్చింది. నిజాముద్దీన్ ఒకరిపై కత్తితో దాడి చేస్తున్నాడు. కంట్రోల్…

తెలంగాణలో పోలీసులకే రక్షణ కరువు

ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే హెడ్ కానిస్టేబుల్ పై ఓ దుండగుడు కత్తితో దాడి చేసి పారిపోయిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే… నిర్మల్ జిల్లా కుభీర్ పోలీసుస్టేషన్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసిన దుండగుడు. నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో కత్తితో పోలీస్ స్టేషన్‌లోకి వచ్చిన వ్యక్తి…..నేరుగా ఎస్ఐ…

బతుకమ్మ పాటల పుస్తకం ఆవిష్కరణ

సూర్యాపేట, మన ప్రజాపక్షం :తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే అతి పెద్దపండుగ బతుకమ్మ పండుగ అని శ్రీ వాసవి సేవాసమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ పై శ్రీ వాసవి సేవాసమితి జిల్లా గౌరవ అధ్యక్షులు ఈగ దయాకర్ గుప్తా సభ్యులతో కలిసి…

మంత్రి వివేక్ వెంకటస్వామిపై కొండా సురేఖ ఫిర్యాదు

తన అటవీ శాఖ అధికారులతో వివేక్ భేటీపై సీఎంవోకు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. ఉపాధి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తనకు సమాచారం ఇవ్వకుండా తన అటవీ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడంపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2-3 రోజుల క్రితం ఈ సమావేశం…