Site icon Mana Prajapaksham

మోదీ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం

ఊర్కొండ, మన ప్రజాపక్షం :సేవాపక్షంలో భాగంగా శుక్రవారం ఊర్కొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన రక్తదాన శిబిరంలో 76 మంది రక్తదానం చేసినట్టు ఆయన తెలిపారు. రక్తదానం చేసిన నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ రక్తదానం ప్రాణదానం లాంటిదని ఆయన కొనియాడారు. రక్త దానం చేయడం వలన ఎదుటి వారి ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్లు అవుతారు అని అన్నారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంభూపాల్ రెడ్డి, శేఖర్ రెడ్డి, బండల రామచంద్రారెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ లక్ష్మారెడ్డి, బిజెపి మాజీ మండల అధ్యక్షులు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిలు పరశురాం, బ్రహ్మచారి, ఉపాధ్యక్షులు రేపని శ్రీను, శివ, కొమ్ము శ్రీను, కిసాన్ మోర్చా అధ్యక్షులు వెంకటరెడ్డి, శేఖర్ రెడ్డి, ధర్మేందర్ రెడ్డి, నీలకంఠేశ్వర్ రెడ్డి, బూత్ అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, సందీప్ కుమార్, మల్లేష్, గోపి, హరీష్, అంజి, నవీన్, ముత్యాలు, కిట్టు, సిద్దు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version