Site icon Mana Prajapaksham

మఖ్తల్ పట్టణంలో అడ్డదిద్ధంగా బైకుల పార్కింగ్

మఖ్తల్, మన ప్రజాపక్షం :మక్తల్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రభుత్వాసుపత్రి వరకు దుకాణాల ముందర ఎవరికి వారు ఇష్టం వచ్చిన తీరుగా బైక్ పార్కింగ్ చేయడంతో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అవుతుందని, గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతుంది. ఈ విషయమై ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా కొందరు మున్సిపాలిటీ మొరిపైన శాశ్వత కట్టడాలు చేపట్టారు. ఈ విషయం గమనించాలని, కొత్త మున్సిపల్ కమిషనర్ కు సమస్యలతో స్వాగతం పలుకుతున్నందుకు కొంచెం ఇబ్బందిగానే ఉన్న తప్పడం లేదని పట్టణ ప్రజలు అంటున్నారు. ముందు బైక్ పార్కింగ్ అక్కడ పెట్టకుండా సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చేస్తే బాగుంటుంది అని మక్తల్ ప్రజలు నూతన మున్సిపల్ కమిషనర్ ను కోరారు.

Exit mobile version