జనగామ, మన ప్రజాపక్షం: నిరుపేదలకు వైద్య సేవలు అందించడం పట్ల డాక్టర్లు బాధ్యత యుతంగా వ్యవహారించాలని ఇంచార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. ఓబుల్కేశ్వపూర్ పీహెచ్సి ని ఇంచార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్ ఆకస్మిక తనికి చేశారు. ముందుగా డ్యూటీ డాక్టర్ల రిజిస్టర్, ఒపీ, ఇన్ పేషంట్ తదితర రిజిస్టర్ లను పరిశీలించారు. స్వస్థ నారీ సశక్తి పరివార్ అభయాన్ ప్రోగ్రామ్ లో భాగంగా పిఎచ్సీ లో ప్రముఖ డెంటల్ డాక్టర్ చే ఎస్పెషాలిటీ రోజు నిర్వహిస్తున్న క్లినిక్ ని ఇంచార్జ్ కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఎన్ఎస్పీఏ స్పెషాలిటీ ఒపీ సేవలు ప్రతీ గ్రామంలో అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ సర్వీసెస్ గురంచి ఓపి, ఇన్ పేషెంట్స్ ని అడిగి తెలుసుకున్నారు. ఎంపిడీఓ ని ఎస్ఎన్ఎస్పిఏ సేవలు గురంచి గ్రామ ప్రజలకి తెలియజేయాలని సూచించారు ఇన్ పేషెంట్స్, ఏఎన్సి కేసులతో మాట్లాడి పిహెచ్సి లో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సి ఆవరణ అంత పరిశుభ్రంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ మల్లిఖార్జున రావు, డ్యూటీ డాక్టర్లు పాల్గొన్నారు.
నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలందించాలి




