మఖ్తల్, మన ప్రజాపక్షం : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ప్రతి నెల నిర్వహించే స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా శనివారం రోజు బతుకమ్మ సంబరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థినీలకు తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో గొప్పనైన పండుగల్లో ఒకటి బతుకమ్మ అని ఏజీయమ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పూలను, ప్రకృతినీ పూజించే పండగలను జరుపుకోవడం అనేది ఎంతో గొప్ప అని తెలియజేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ రామక్రిష్ణ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు, నడవడికలు తెలియజేసుకోవడానికి ఇలాంటి పండగలు కారణమే అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రామకృష్ణ, ఏజిఎం భాస్కర్ రెడ్డి, అకాడమిక్ కోఆర్డినేటర్ రఘుబాబు, ప్రైమరీ కో ఆర్డినేటర్ మృదుల, ప్రీ ప్రైమరీ కోఆర్డినేటర్ శ్రీ లత, పాఠశాల డీన్ రఘు, ప్రైమరీ ఇన్చార్జ్ జ్యోతి, ప్రీ ప్రైమరీ ఇన్చార్జ్ మహాలక్ష్మి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు




