Site icon Mana Prajapaksham

జిల్లా షీ టీం ఆధ్వర్యంలో చట్టాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదేశాల మేరకు జిల్లా షీ టీం మరియు ఏహెచ్టియూ టీం ఆధ్వర్యంలో వెల్దండ మండల కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో మరియు జూనియర్ కళాశాలలో ఈవిటిజింగ్ , పోక్సో చట్టం మరియు ఉమెన్ ట్రాఫికింగ్, చైల్డ్ మ్యారేజ్ వంటి వాటి గురుంచి అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలు, విద్యార్థినులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి బెదిరింపులకు భయపడవద్దని , ప్రయాణం చేసే అమ్మాయిలు, మహిళలు కచ్చితంగా టి సేఫ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రయాణంలో ఉన్నపుడు తప్పక యాప్ ను ఉపయోగించుకోవాలని సూచించారు. మహిళలు ఏ సమస్య ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప అధైర్య పడోద్దని, ఎవరైనా వేధింపులకు గురి చేస్తే వెంటనే డయల్ 100 లేదా 8712657676 నెంబర్ కు ఫోన్ చేసి వారి సమస్యలు, వివరాలు పోలీసులకు తెలుపుతే తక్షణ సహాయం అందుతుందని సూచించారు.

Exit mobile version