Mana Praja Paksham Desk

Mana Praja Paksham Desk

పొంగులేటి బయోపిక్ లో హీరోగా సుమన్

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీవిత చరిత్ర తిరగకెక్కనుంది. “శ్రీనన్న అందరివాడు” అనే టైటిల్ తో రూపుదిద్దుకునే ఈ సినిమాలో పొంగులేటి వ్యక్తిగత రాజకీయ జీవితాన్ని తెరకెక్కించనున్నారు. సీనియర్ నటుడు సుమన్ ఈ చిత్రంలో పొంగులేటి పాత్రను పోషించనున్నారు. దీనికి డైరెక్టర్, నిర్మాతగా వెంకట నరసింహా రాజ్ వ్యవహరిస్తుండగా, పాటలు కాసర్ల శ్యాం రాస్తున్నారు.

ముందు ఆట‌పై దృష్టి పెట్టండి

ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు కరచాలనం చేయకపోవడంపై చెలరేగిన వివాదంపై టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. ఇలాంటి చిన్న విషయాలను పెద్దవి చేయాల్సిన అవసరం లేదని, ఆటపైనే దృష్టి పెట్టాలని చుర‌క‌లంటించాడు. షేక్ హ్యాండ్ ఇవ్వాలా? వద్దా? అనేది ఆటగాళ్ల వ్యక్తిగత ఇష్టానికి సంబంధించిన విషయమని స్పష్టం…

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ

తెలంగాణలో తీవ్ర రాజకీయ చర్చకు దారితీసిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ విచారణ ప్రక్రియను ప్రారంభించారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ దృష్టి సారించారు. ఈ విచారణలో భాగంగా, పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్…

అమెరికాలో గొడవ..పోలీసుల కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నిజాముద్దీన్ (32) అమెరికా పోలీసుల కాల్పుల్లో మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎంఎస్ చేసేందుకు 2016లో యూఎస్ కు వచ్చిన అతడు జాబ్ లేకపోవడంతో కాలిఫోర్నియాలో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. రూమ్మేట్స్ మధ్య గొడవ జరుగుతోందని సెప్టెంబర్ 3న కాల్ వచ్చింది. నిజాముద్దీన్ ఒకరిపై కత్తితో దాడి చేస్తున్నాడు. కంట్రోల్…

తెలంగాణలో పోలీసులకే రక్షణ కరువు

ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే హెడ్ కానిస్టేబుల్ పై ఓ దుండగుడు కత్తితో దాడి చేసి పారిపోయిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే… నిర్మల్ జిల్లా కుభీర్ పోలీసుస్టేషన్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసిన దుండగుడు. నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో కత్తితో పోలీస్ స్టేషన్‌లోకి వచ్చిన వ్యక్తి…..నేరుగా ఎస్ఐ…

సౌదీ, పాక్ మధ్య రక్షణ ఒప్పందం

అణ్వాయుధ దేశం పాకిస్తాన్‌కు సౌదీ అరేబియాకు మధ్య బుధవారం ఒక పరస్పర భద్రతా ఒప్పందం కుదిరింది. ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య ఈ భద్రతా ఒప్పందం కుదిరింది గత కొన్ని నెలల క్రితమే, భారత్‌తో పాకిస్తాన్‌ సైనిక ఘర్షణకు తలపడింది ఇలాంటి పరిస్థితుల్లో, ఈ ఒప్పందం కేవలం…

బతుకమ్మ పాటల పుస్తకం ఆవిష్కరణ

సూర్యాపేట, మన ప్రజాపక్షం :తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే అతి పెద్దపండుగ బతుకమ్మ పండుగ అని శ్రీ వాసవి సేవాసమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ పై శ్రీ వాసవి సేవాసమితి జిల్లా గౌరవ అధ్యక్షులు ఈగ దయాకర్ గుప్తా సభ్యులతో కలిసి…

మంత్రి వివేక్ వెంకటస్వామిపై కొండా సురేఖ ఫిర్యాదు

తన అటవీ శాఖ అధికారులతో వివేక్ భేటీపై సీఎంవోకు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. ఉపాధి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తనకు సమాచారం ఇవ్వకుండా తన అటవీ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడంపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2-3 రోజుల క్రితం ఈ సమావేశం…

గంజాయి మత్తులో ఖైదీల వీరంగం

సంగారెడ్డి, మన ప్రజాపక్షం : సంగారెడ్డి జిల్లా జైలుకు రిమాండ్ ఖైదీలుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు వీరంగం సృష్టించారు. గంజాయికి బానిసలు అయిన ఇద్దరు వ్యక్తులు జైలులో గంజాయి దొరకగా దారుణంగా ప్రవర్తించారు. ఆత్మహత్యాయత్నం చేసి జైలు అధికారులకు ముచ్చెమటలు పట్టించారు. అనంతరం వారిని ఉస్మానియా, ఎర్రగడ్డ, గాంధీ ఆస్పత్రులకు తరలించారు పోలీసులు. వివరాల్లోకి వెళితే..…

మెడికల్ కాలేజీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలి

సూర్యాపేట, మన ప్రజాపక్షం :సూర్యాపేట ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో వివిధ విభాగాలలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఐదు నెలల నుండి వేతనాలు రాక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వేంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నాడు ప్రభుత్వ జిల్లా వైద్యశాల వద్ద మూడు రోజులుగా దీక్షలు…