నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : 2025 – 2026 సంవత్సరానికి గాను జిల్లాలో నడపబడుతున్న స్వచ్ఛంద సంస్థల నూతన మరియు పాత సంస్థల గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొరకు పలు ధ్రువపత్రాలను అర్హత కలిగిన వారు జిల్లా షెడ్యూల్డ్ కులాల శాఖ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా నాగర్ కర్నూలు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి కజ్జం ఉమాపతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత ధ్రువపత్రాలు, ఎన్జీవో నమోదు దృవపత్రం, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు సంబంధిత జిల్లా లేదా జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం 2017 ప్రకారం దృవపత్రం, పూర్తి చిరునామా/ఫోన్ నంబర్లతో నిర్వహణ కమిటీ సభ్యుల జాబితా, గత మూడు సంవత్సరాల ఆడిట్ చేసిన ఖాతాల ప్రకటన, గత సంవత్సరాల్లో విడుదల చేసిన గ్రాంట్ కు సంబందించిన వినియోగ దృవపత్రం – గత సంవత్సరాలలో ఛార్టర్డ్ అకౌంటెంట్ వారి లెటర్ హెడ్ పై అసలైన ప్రతిగా జారీ చేయబడినది, లబ్ధిదారులు /నివాసితుల జాబితా – వయస్సు /కులం /తరగతి వారీగా /ఫోటోతో సహా మరియు ఉద్యోగుల దృవపత్రముల వివరాలతో కూడిన జాబితాలను సమర్పించవలెనని తెలిపారు. వివరాల కోసం 9705606304 ఈ నంబర్ ను కార్యాలయ పనివేళల్లో సంప్రదించవచ్చని తెలిపారు.
స్వచ్చంద సంస్థల నూతన & పాత రిజిస్ట్రేషన్ కొరకు దరఖాస్తుల ఆహ్వానం