నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామంలో తల్పునూర్ రోడ్డుకు,బీరప్ప గుడి ముందు సర్వే.నం. 823 లో, విస్తీర్ణం అందాద 1.20 గుంటల్లో పర్మిషన్ లేకుండా అనధికార వెంచర్ చేశారని బిఎస్పీ పార్టీ మాజీ రాష్ట్ర ఈసీ మెంబర్ పృధ్వీరాజ్, జిల్లా ఇంచార్జ్ కళ్యాణ్ లు అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ పార్టీ మాజీ రాష్ట్ర ఈసీ మెంబర్ పృధ్వీరాజ్, జిల్లా ఇంచార్జ్ కళ్యాణ్ లు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే, ఎమెల్సీ గ్రామంలోనే కొంతమంది వ్యక్తులు అనధికార వెంచర్ చేస్తే, అసెంబ్లీలోని మిగతా గ్రామాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తూడుకుర్తి గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా, డిటిసీపీ అనుమతి లేకుండా వెంచర్ ఎలా చేస్తారని మండిపడ్డారు. తహసిల్దార్ కార్యాలయంలో పట్టా భూమికి నాలా పర్మిషన్ తీసుకుని, పట్టా భూమినీ గుంటల్లోకి మార్చి, గుంటలకు డాక్యుమెంట్ తయారుచేసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా కొనుగోలుదారులకు ప్లాట్స్ రూపంలో విక్రయిస్తున్నారని అన్నారు. ఇది చట్టాన్ని మోసగించడం కాదా అనీ నిలదీశారు. వెంచర్ చేసే వాళ్లకు కనీసం గ్రామ పంచాయతీ అనుమతి కూడా లేకపోతే ఎలా అనీ మండిపడ్డారు. కేవలం వెంచర్ చేయడానికి 4 మూలాలకు, 4 రాళ్ళు ఉంటే సరిపోతుందా అనీ విమర్శించారు. అనధికార వెంచర్ పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని తూడుకుర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శి రవీందర్, తహసీల్దార్ కార్యాలయం రెవెన్యూ ఇన్స్పెక్టర్ అబేద్ అలీ, సబ్ రిజిస్ట్రార్ రాజేష్ లను కోరడం జరిగింది. అనధికార వెంచర్ పై చర్యలు తీసుకోకపోతే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ తిమ్మాజీపేట మండల ఉపాధ్యక్షులు శంకర్, మధు తదితరులు పాల్గొన్నారు.
తూడుకుర్తి గ్రామంలో అనధికార లే అవుట్ పై చర్యలు తీసుకోవాలి