హైదరాబాద్, మన ప్రజాపక్షం : మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి(73) కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్యంతో బాధపడుతున్న హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విడిచారు. అయితే దామోదర్ రెడ్డి అయిదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో మినిస్టర్ గా కూడా ఆయన కొనసాగారు. ఈనెల 4న తుంగతుర్తి లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు, మిత్రులు తెలిపారు.
మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కన్నుమూత




