తండా వాసులు
ఊర్కొండ, మన ప్రజాపక్షం :ఎన్ని ప్రభుత్వాలు మారినా గ్రామ పంచాయతీలకు దూరంగా ఎలాంటి అభివృద్ధికి నోచుకొని తండాలు కూడా అభివృద్ధి చెందాలని వర్షాకాలంలో గుంతలు గుంతలుగా ఉన్నటువంటి రోడ్లను బాగుచేయాలనే గొప్ప సంకల్పంతో తండాలకు కూడా రోడ్డు సౌకర్యాలు ఉండాలని సొంత జెసీబీతో ఆదివారం నాడు బిజెపి రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోనో జకినాలపల్లి గ్రామపంచాయతిలో భాగమైనటువంటి మట్టం తండా నుండి అమ్మపల్లి తండా వరకు మోరం వేయించి రోడ్డును బాగు చేయించడం జరిగింది. ముచ్చర్ల జనార్దన్ రెడ్డి తండాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి పదవులు లేకున్నా ప్రజలు బాగుండాలనే సంకల్పంతో మా కోసం కష్టపడుతున్న ప్రజానాయకుడు ముచ్చర్ల జనార్దన్ రెడ్డికి ఎల్లవేళలా ఋణపడి ఉంటామని తండా వాసులు సంతోషం వ్యక్తం చేస్తు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల నాయకులు, తండా వాసులు ఉన్నారు.



