నిర్మల్, మన ప్రజాపక్షం :నిర్మల్ జిల్లా సొన్ మండలం వెల్మల్ బొప్పారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం బాలశక్తి కార్యక్రమంలో భాగంగా బ్యాంకింగ్ అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్డీఎం మాట్లాడుతూ జిల్లాలో బాలశక్తి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయని, వాటిలో ఆర్థిక అక్షరాస్యత కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. విద్యార్థులు రోజువారీ బ్యాంకు లావాదేవీలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం వినియోగం, పాయింట్ ఆఫ్ సేల్ (పి.ఓ.ఎస్), ఐఎంపిఎస్, ఆర్టీజిఎస్, నెఫ్ట్ తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను తరచూ సమీప బ్యాంకులకు తీసుకెళ్లి అక్కడి లావాదేవీలను ప్రత్యక్షంగా చూపించాలని, తద్వారా సైబర్ క్రైమ్ వంటి వాటిపై విద్యార్థులకు అవగాహన పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బందితో పాటు వివిధ బ్యాంకుల ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రతి విద్యార్థి బ్యాంకింగ్ కార్యకలాపాలపై అవగాహన కలిగి ఉండాలి




