భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న రహదారులపై అత్యవసర మరమ్మత్తులు

నిర్మల్, మన ప్రజాపక్షం :నిర్మల్ జిల్లాలో ఇటీవలి కురిసిన భారీ వర్షాల కారణంగా పంచాయతీరాజ్, ఆర్ & బి (రోడ్స్ & బిల్డింగ్స్) శాఖ పరిధిలోని రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనేక గ్రామీణ ప్రాంతాలు మాండల కేంద్రాలకు, జిల్లా కేంద్రానికి కలిసే రహదారులు గుంతలు పడటంతో, రవాణా అంతరాయం ఏర్పడింది. ప్రజలు రోజువారీ ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దృష్టికి వచ్చిన వెంటనే, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిపి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ బృందాలు ఇప్పటికే నష్టపరిహారం అంచనాలు వేసి, అత్యవసర మరమ్మత్తు పనులు ప్రారంభించాయి. రహదారులపై వర్షాల వల్ల ఏర్పడిన గుంతలను పూడ్చి, నీటి నిల్వలను తొలగించి, వాహన రాకపోకలు సురక్షితంగా సాగేందుకు తాత్కాలిక మరమ్మత్తులు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి మాండల, జిల్లా కేంద్రాలకు కలిపే ప్రధాన రహదారులకు ప్రాధాన్యం ఇచ్చి మరమ్మత్తు పనులు వేగవంతం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, మాట్లాడుతూ, ప్రజలకు రవాణా ఇబ్బందులు కలగకుండా వెంటనే చర్యలు తీసుకున్నాము. జిల్లాలో రహదారి సౌకర్యాల పునరుద్ధరణ చర్యలలో భాగంగా పలు మార్గాలలో తాత్కాలిక మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. నర్సాపూర్ – జి, కుస్లీ రోడ్ పై తాత్కాలిక పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. అలాగే అల్లంపల్లి రోడ్ కడెం మండల పరిధిలో రహదారి పునరుద్ధరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా తానూర్ మండలంలోని తానూర్ నుండి ముగ్లీ రహదారి పై వరదల నష్టానికి తాత్కాలిక పునరుద్ధరణ పనులు చేపట్టడం జరిగింది. సంబంధిత శాఖల అధికారులు పనులను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో రహదారులు శాశ్వతంగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆమె పేర్కొన్నారు. అలాగే, ఇకపై వర్షాల ప్రభావంతో రహదారులు దెబ్బతిన్న చోట్ల వెంటనే స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యమైన రహదారులకు పర్మనెంట్ రోడ్డు రిపేర్ ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నాణ్యతపై తనిఖీలు. మాన్సూన్ సీజన్‌కు ముందే రహదారుల పరిస్థితి సమీక్షించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లా ప్రజల రవాణా సమస్యలు తొలగించడమే లక్ష్యమని, రోడ్ల మరమ్మత్తు పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Mana Praja Paksham Desk
Mana Praja Paksham Desk
Articles: 224

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *