జనగామ, మన ప్రజాపక్షం :గురువారం కలెక్టర్ కార్యాలయంలో క్రిస్టియన్ ప్రజల సమస్యలపై జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఇన్ఛార్ కలెక్టర్ పింకేష్ కుమార్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ)బెన్ షాలోమ్ లతో కలిసి రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కొక్కడన్ పోస్టర్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ దీపక్ జాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేద క్రిస్టియన్ సోదరులకు అందే విధంగా ప్రతి ఆదివారం చర్చ్ లలో తెలియజెప్పాలని సూచించారు. అదే విధంగా సంఘాలలో విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. 4 అంశాలపై సమగ్రంగా చర్చించి పాస్టర్స్ కోరిన విధంగా ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టి ముందుగా ప్రతి నియోజకవర్గంలో శ్మశాన వాటిక, కమ్యూనిటీ హల్ ఏర్పాటు కు చర్యలు తీసుకుంటామన్నారు. చర్చ్ నిర్మాణాలకు అనుమతులు, కులధ్రువీకరణ పత్రాల మంజూరు కు ప్రభుత్వ నిబంధనల మేరకు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరిస్తామన్నారు. నియోజకవర్గ పరిధిలో క్రిస్టియన్ లు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి తమ పరిధిలోని క్రిస్టియన్ ప్రజల సమస్యల పరిష్కారం కొరకు విజ్ఞాపన పత్రాన్ని జిల్లా కలెక్టర్ కు ఇవ్వాలన్నారు. తనకు వాట్సాప్ ద్వారా పంపించాలన్నారు. జిల్లా ఇంచార్జి కలెక్టర్ పింకేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో జనాభా లెక్కల ప్రకారం సుమారు 6వేలు క్రిస్టియన్స్ ఉన్నరన్నారు. జనగామ, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి నియోజక వర్గాలలో బరియల్ గ్రౌండ్ కు చర్యలు తీసుకుంటామని, మున్సిపాలిటీలలో కమ్యూనిటీ హాల్స్ కేటాయించామని వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల మంజూరులో లక్ష్యాలను క్రిస్టియన్ లు సాధించాలన్నారు. చర్చ్ అనుమతుల కొరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ బి.విక్రమ్ కుమార్, జిల్లాలోని పలు చర్చిల పాస్టర్లు పాల్గొన్నారు.
క్రిస్టియన్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు


