గద్వాల, మన ప్రజాపక్షం : పొలంలో మిరప, పత్తి పంటల మధ్యలో గంజాయి సాగు చేస్తున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో గద్వాల జిల్లా గట్టు ఎస్ఐ, వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ సెక్రటరీతో కలిసి తనిఖీలు నిర్వహించారు. పోలీసులు తొమ్మిది గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. నిందితుడు బస్వాపురం ప్రాణేష్, వయస్సు 21 సంవత్సరాలు, తోతినోనిదొడ్డి గ్రామానికి చెందిన రైతుగా గుర్తించినట్లు తెలిపారు. గంజాయి సాగు, రవాణా లేదా విక్రయాన్ని ఎవ్వరూ సహించం అని అన్నారు. యువత భవిష్యత్తును నాశనం చేసే ఈ మత్తు పదార్థాలను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి సాగు లేదా విక్రయం ఎక్కడైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని గద్వాల సర్కిల్ ఇన్స్పెక్టర్ టంగుటూరి శ్రీను తెలిపారు.
గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు


