బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం

జనగామ, మన ప్రజాపక్షం : జనగాం జిల్లాలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా జరిగింది.
స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్‌పై హైకోర్టు విధించిన స్టేను తీవ్రంగా ఖండిస్తూ, వివిధ బీసీ కుల సంఘాల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఏకగ్రీవంగా పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సమావేశానికి సభాధ్యక్షులుగా జాయ మల్లేష్ (కురుమ), పండుగ హరీష్ ముదిరాజ్ నేతృత్వం వహించారు. అలాగే ఈ సమావేశానికి బీసీ జేఏసీ కన్వీనర్‌గా సేవెల్లి సంపత్ (కురుమ)ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. సేవెల్లి సంపత్ మాట్లాడుతూ రాబోయే అక్టోబర్ 18న జరగబోయే బీసీ బంద్‌కు అన్ని వ్యాపార సంస్థలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, అదేవిధంగా విద్యా సంస్థలు పూర్తిస్థాయిలో మూసివేయాలని కోరారు. బీసీల హక్కులను కాపాడుకునే దిశగా రాష్ట్రవ్యాప్తంగా ఐక్యంగా ఉద్యమం కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రముఖ బీసీ జేఏసీ నాయకులు దూడల సిద్దయ్య గౌడ్, డాక్టర్ మాచర్ల బిక్షపతి ముదిరాజ్,సాదిక్ హలీ, మంగంపల్లి రాజు, ప్రశాంత్ యాదవ్, మరియు బీసీ సంక్షేమ సంఘం జేఏసీ నాయకుడు పండుగ హరీష్ ముదిరాజ్ మాట్లాడారు. హైకోర్టు స్టేను తక్షణమే రద్దు చేయాలని, బీసీలకు తగిన న్యాయం జరగాలని నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ జేఏసీ పిలుపునిచ్చిన అక్టోబర్ 18 బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ, జనగాం జిల్లాలో కూడా బంద్‌ను విజయవంతంగా అమలు చేయాలని సమావేశం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చిక్కుడు బాలయ్య ముదిరాజ్ (రాష్ట్ర కార్మిక శాఖ అధ్యక్షులు), రామేశ్వర్ చారి, చౌదర్పల్లి చంద్రశేఖర్, ధర్మపురి శ్రీనివాస్, పిట్టల రజనీకాంత్, బోళ్ల రాజ్ కుమార్, నీల సాంబరాజు, మారబోయిన శ్రీనివాస్, ఎన్. మహేందర్, సత్యం శ్రీనివాస్, శైలేంద్ర శ్రీనివాస్, కే. రాజు, చంద్రమౌళి, ఎం. సత్తయ్య, శ్రీనివాస్ నరసింహులు, సమ్మయ్య యాదవ్, కే. అవినాష్, మదన్, చింతకింది మల్లేష్, బోళ్ల సంపత్ యాదవ్, పూర్ణచందర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Mana Praja Paksham Desk
Mana Praja Paksham Desk
Articles: 224

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *