Site icon Mana Prajapaksham

అంగరంగ వైభవంగా 20వ దసర శరన్నవరాత్రి ఉత్సవాలు

మఖ్తల్, మన ప్రజాపక్షం : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 20వ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ కొత్త శ్రీనివాస్ గుప్తా, ఆలయ కమిటీ అధ్యక్షుడు కట్టా సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22వ తేదీ నుండి 25వ తేదీ వరకు ప్రతిరోజు ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమార్చన, కలశపూజ, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అలాగే సోమవారం నాడు అమ్మవారి తేప్పోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నామని ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాలలో ప్రతిరోజు ప్రజలందరి సహాయ సహకారాలతో 20వ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో పట్టణ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పట్టణ పుర ప్రముఖులు, ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనాలని నేడు మక్తల్ మండల తాహసిల్దార్ సతీష్ కుమార్ ను ఆర్యవైశ్య యువకులు ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువకులు కొత్త సుజిత్, మనసాని కిరణ్, వడ్వాట్ వెంకటేష్, మేడిశెట్టి పవన్ కుమార్, మనసాని రంజిత్, తిరుపాల్, గురు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version