ఊర్కొండ, మన ప్రజాపక్షం : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వారోత్సవాల సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండల కేంద్రంలో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్టు బిజెపి రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో గర్వించదగ్గ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వారోత్సవాల సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఊరుకొండ మండలమే కాకుండా నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా బిజెపి పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఈ రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
బిజెపి రాష్ట్ర నాయకులు ఎంజెఆర్ ఆధ్వర్యంలో నేడే రక్తదాన శిబిరం




