Site icon Mana Prajapaksham

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

Krishnashtami celebrations in full swing

Krishnashtami celebrations in full swing

సూర్యపేట, మన ప్రజాపక్షం : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. సింహమాసంలో అష్టమి రోహిణి నక్షత్ర యుక్తముగా నిర్వహించబడే శ్రీకృష్ణుడి పుట్టిన రోజు వేడుకలు, ఆండాళ్ గోష్ఠి భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున స్వామివారికి పంచామృతములతో తిరుమంజన స్నపనం (అభిషేకం) సాయంత్రం పుట్టినరోజు వేడుకలు నిర్వహించి విశేష ప్రసాద నివేదనలు జరిపారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారి అష్టోత్తర నామాలు భజనలు కీర్తనలు దివ్య ప్రబంధ సేవా కాలం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల, వేణుగోపాల చార్యులు, సంకర్షణ ఆచార్యులు, శ్రీహరి ఆచార్యులు, ఫణికుమార్ ఆచార్యులు, బజ్జూరి కృష్ణయ్య, మంజుల, జ్ఞానకుమారి, మాధవి విజయ, పద్మ, జ్యోతి, సుమాల తదితర భక్తబృందం ఆండాలు గోష్టి భక్తబృందం పాల్గొన్నారు.

Exit mobile version